తెలుగు దేశం పార్టీ మండల అద్యక్షునిగా గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 03/11/2025
ఎరుపాలెం మండల పరిధిలో జమలాపురం గ్రామంలో వాసిరెడ్డి కళ్యాణమండపము నందు తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఎర్రుపాలెం మండల అధ్యక్షుడుగా సేవలందించిన దోమందల సామేలు రేపు అనగా నాలుగో తారీఖు నాడు అమెరికావెళుతున్నారు. కనుక వారి స్థానంలో కొత్తగా తెలుగుదేశం పార్టీ నుండి అధ్యక్షులు ఎన్నిక గురించి ఈ అధ్యక్ష ఎన్నికకు ఎరుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి ని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ మరియు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల వారు ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా దోమందుల సామేలు ని సత్కరించడం జరిగినది. తర్వాత ఎన్నిక కాబడిన గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి ని అందరూ అభినందించినారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వర రెడ్డి, జవాజి భాస్కరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి శివకుమారి, గోస్ రామారావు, భాస్కర్ రెడ్డి చాట్ల బాబురావు, కొర్లపాటి శ్రీనివాసరావు, వేముల వెంకటేశ్వరరావు, రాజా, దేవరకొండ మోహన్ రావు, కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, నాని, కోగంటి సత్యనారాయణ, గంగవరపు కృష్ణారావు, ఎస్ కే లాలు, వరికూటి రవి, వరికూటి శ్రీనివాసరావు, మారాబత్తుల వెంకన్న, పామర్తి శ్రీనివాసరావు, పోగంటి నాగేశ్వరరావు, వేముల శ్రీనివాసరావు, బొగ్గుల సత్యనారాయణ రెడ్డి, రాజా, నందియా తదితరులు ఈ కార్యక్రమం లోపాల్గొన్నారు









