సొంత ఖర్చులతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 03/11/2025
ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో భట్టి కాలనీ లో యరమల పూర్ణచంద్ర రెడ్డి (KPR) ఎనిమిది మంది లబ్ధిదారులకు సొంతగా ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన చేసిన 100 రోజుల్లో పురోగతి మరొక 10 రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.. అందరి లబ్ధిదారులకు ఇళ్లు స్లాబ్ బిల్లు వరకు ఒక్కొక్కరికి ఇప్పటి వరకు 4 లక్షలు రూపాయలు వారి అకౌంట్ లో జమాయ్యాయి…
పూర్ణ చంద్రరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షం వారు ఇందిరమ్మ ఇళ్లపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని ఎంత తొందరగా ఇళ్లను పూర్తి చేస్తే అంత తొందరగా అమౌంట్ మీ ఖాతాలో జమవుతాయి.. మండలం లోని కొన్ని ఇళ్లకు టెక్నికల్ ఇష్యు ప్రాబ్లం వలన కొంతమంది లబ్ధిదారులకు ఆలస్యంగా బిల్లులు జమవుతాయి ఎవరు కూడా అధైర్య పడవద్దు కొద్ది రోజుల్లో వారి అకౌంట్లో కూడా జమవుతాయని అని అన్నారు.. భీమవరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు









