తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం లు శుక్రవారం పలు వివాహాల్లో పాల్గని వధూవరులను ఆశీర్వదించారు. గండిపేట సమీపంలోని మంచిరేవులలో గల రిధిర రిట్రీట్ రిసార్ట్ లో జరిగిన ఈనాడు రిపోర్టర్, సీనియర్ జర్నలిస్టు సిరివోలు సీతారామచందర్ రావు కూతురు వైష్ణవి వివాహ వేడుల్లో పాల్గొన్నారు. అనంతరం జీడిమెట్ల సూరారంలోని వీఐపీ గార్డెన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ జర్నలిస్టు చిర్రా శ్రీనివాస్ సోదరి మీనాక్షీ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా నాయకులు సంజీవ కుమార్, శ్రావణ్ తదితరులు కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
Post Views: 16









