+91 95819 05907

డ్రగ్స్ రవాణాకు చెక్! అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల పహారా: “చైతన్యం”లో భాగంగా అశ్వారావుపేటలో విస్తృత తనిఖీలు

తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు నాకాబంది: ఎస్సై యాయతిరాజు హెచ్చరిక – డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు సహకరించాలి.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 10: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మరింత వేగం పుంజుకుంది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా అశ్వారావుపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున విస్తృత స్థాయిలో నాకాబందు నిర్వహించారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం మరియు భద్రాచలం రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలను తీవ్రతరం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగిన ఈ నాకాబందిలో ప్రతి వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. పోలీసులు ప్రత్యేకంగా మత్తు పదార్థాల రవాణా, గంజాయి సరఫరా, నిషేధిత మందుల చలామణి వంటి అంశాలపై దృష్టి సారించారు. వాహనాలలో ఉన్న సీట్లు, ఇంజిన్ భాగాలు, బ్యాగులు, లగేజీలను కూడా జాగ్రత్తగా తనిఖీ చేశారు. ఈ నాకాబంది కార్యక్రమంలో అశ్వారావుపేట పోలీస్ ఎస్సై యాయతిరాజు తన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి అని కోరారు. అలాగే ఎవరైనా గంజాయి లేదా ఇతర నిషేధిత పదార్థాలను వినియోగించినా విక్రయించినా లేదా రవాణా చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు అని గట్టిగా హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారం లేకుండా డ్రగ్స్ నిర్మూలన సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రతి వారం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. పోలీసుల ఈ కఠిన చర్యతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యసనంతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, పోలీసులు తీసుకుంటున్న చర్యలు సముచితం అని పలువురు అభిప్రాయపడ్డారు. నాకాబంది కారణంగా వాహనదారులు కొంతసేపు ఇబ్బంది పడినా ప్రజల భద్రత కోసం ఈ చర్యలు అవసరమని అంగీకరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !