నేటి గదర్ కరకగూడెం: మండలం గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ, (సెర్ప్ ),
ఆధ్వర్యంలో ఉల్లాస్ -అమ్మకు అక్షర మాల స్వయం సహాయక సంఘం లోని ప్రతీ సభ్యురాలు విద్యావంతురాలు అయ్యి తద్వారా ఆయొక్క కుటుంబాలు, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం కావాలి అనే, ఉద్దెశం తో కరకగూడెం మండలం
లని అన్ని గ్రామాల్లో గుర్తించిన, నిరక్షరాస్యులకు చదవడం వ్రాయడం, వాలంటీర్లు ద్వారా నేర్పించుటకు, ఉల్లాస్ విద్యా కేంద్రాలు అన్ని గ్రామసమాఖ్య ల పరిధిలో ప్రారంభం చేయుట జరిగింది.
దీనిలో భాగంగా మండల స్థాయి ఉల్లాస్ -అమ్మకు అక్షర మాల కమిటీ ఆధ్వర్యంలో చిరుమల్ల గ్రామం లో విద్యా తరగతులు ప్రారంభం చేయుట జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వయోజన విద్యా డిప్యుటీ డైరెక్టర్ సీ. హెచ్ అనిల్ హాజరైనారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్
ఆదేశాల మేరకు స్వయం సంఘాల లోని సభ్యులు అందరు ఈ కార్యక్రమం, సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా సామాజికంగా ఎదగాలని తద్వారా
వారి కుటుంబాలలో పేదరికం,విద్య ద్వారానే నిర్మూలన చేసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గడ్డం మంజుల, సేర్ప్ ఎపిఎం బి.వినోద్ క్రాంతి,ఎంపీఓ మారుతీ గ్రామపంచాయతి కార్యదర్శి రామక్రిష్ణ,సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, వివోఏలు ,పాలకవర్గ సభ్యులు, వాలంటీర్ లు,డ్వాక్రా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.









