+91 95819 05907

సామినేని హంతకులను అరెస్టు చేయాలి..

* డీజీపీకి సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుల వినతి
* రాజకీయ కక్ష్యలతోనే హత్య
* ఘటన జరిగి 12 రోజులైనా కేసును ఛేదించటంలో నిర్లక్ష్యం

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెసరకాయల జంగారెడ్డి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డికి హైదరాబాదులో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. పార్టీకి చెందిన సామినేని రామారావును అక్టోబర్ 31వ తేదీన పాతర్లపాడు గ్రామంలో ఉదయం 5:30 గంటల సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారని… ఈ ఘటన జరిగి ఇప్పటికీ 12 రోజులు అవుతున్నా నిందితులను అరెస్టు చేయటంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. పాతర్లపాడు గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

* రాజకీయ కక్షతోనే హత్య
రామారావు బతికి ఉంటే సీపీఐ (ఎం)ను ఓడించటం సాధ్యం కాదని భావించి రాజకీయ కక్షలతోనే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. హంతకులను నేను స్వయంగా చూశాను.. అని వారి పేర్లతో సహా రామారావు భార్య స్వరాజ్యం పోలీసులకు పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవటాన్ని తప్పు పట్టారు. రామారావు నిస్వార్ధ నాయకుడు, వారి స్వగ్రామానికి రెండుసార్లు ఆయన ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యారని తెలిపారు. రామారావు సతీమణి ఒకసారి గ్రామ సర్పంచ్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పేదలకు తమ సొంత భూమిని ఇండ్ల స్థలాల కోసం పంచిన చరిత్ర రామారావు కుటుంబానికి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా రామారావు సేవలు అందించారని, సీపీఐ (ఎం)లో దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్నారని వివరించారు. గత కొంతకాలంగా తన స్వగ్రామం పాతర్లపాడు లో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇది సహించలేని కాంగ్రెస్ నాయకులు ఆయన ఉంటే రాజకీయంగా తమ మనుగడ సాగదని భావించి, కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యకు కారణమైన వారందరినీ అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !