+91 95819 05907

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతు స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు.
హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పని చేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని కలెక్టర్ అన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ మనమంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు.
మన రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేకంగా మైనారిటీ బాలికల విద్య పై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. కళావతి బాయి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి ముజాహిద్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !