+91 95819 05907

దమ్మపేటలో అక్రమ చొరబాటుదారులపై బీజేపీ హెచ్చరిక

దమ్మపేటలో అక్రమ చొరబాటుదారులపై బీజేపీ హెచ్చరిక

ఢిల్లీ బాంబు దాడి నేపథ్యంలో భద్రతపై ఆందోళన – ఎస్సై, ఎంఆర్ఓ లకు వినతిపత్రం

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 12: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడి ఘటన దాని పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో భద్రతపై భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ బీజేపీ నాయకులు స్థానిక ఎస్సై మరియు మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలలో వినతిపత్రం సమర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి దమ్మపేట మండల పరిధిలో కొందరు కొత్త వ్యక్తులు తిరుగుతున్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన విధ్వంసం వంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, ఈ ప్రాంతంలో తిరుగుతున్న అక్రమ చొరబాటుదారులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రజల భద్రతను నిర్ధారించడంలో అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, నాగరాజు, ఉడతనేని విశ్వేశ్వరరావు, గూడా ముత్యాలరావు, కారం రత్నా కుమారి, బెల్లం కృష్ణవేణి, నాగుల చందు, సొరకాయల సీతారాములు, గ్రంధి రాఘవేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !