శ్రీ రక్షా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలో బుధవారం రమణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో శ్రీ రక్షా హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.రోగులకు ఉచితంగా బి పీ,షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.శ్రీ రక్ష హాస్పిటల్ వారు మాట్లాడుతూ అన్ని రకాల అత్యవసర సేవలు తమ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని అత్యవసర వైద్య సేవల కోసం శ్రీ రక్ష హాస్పిటల్ ను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .రమణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకులు గడ్డం విజయ్ మాట్లాడుతూ చింతకాని మండలంలో ని ప్రజలు అన్ని రకాల రక్త పరీక్షలు కి తమ ల్యాబ్ లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ .కృప,పొలగాని కమలాకర్,శ్రీకాంత్,రమణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ యాజమాన్యం గడ్డం విజయ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.









