+91 95819 05907

హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో దొరికిన విషపదార్ధాలు

హైదరాబాద్ లోని రాజేద్రనగర్ లో అహ్మద్ మొహియు్దీన్ సయ్యద్ అనే ఉగ్రవాది మూడు రోజుల క్రితం పట్టుబడ్డాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఇతనిని మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అహ్మద్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్య కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్…చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పని చేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీహ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్ళల్లో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పాయిజన్ ను దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్ళు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాది మంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తాజాగా మరోసారి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరోసారి తనిఖీలను చేపట్టింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ లలో సోదాలు చేసింది. రాజేంద్రనగర్‌లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ATS బృందం తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో గంటన్నరకు పైగా సోదాలు చేసింది. వీటిల్లోరెసిన్ చేసే యంత్రాలు, అది ఎలా తయారు చేయాలో తెలిపే బుక్స్ తో పాటూ భారీగా రైసిన్ విషపదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు పట్టుబడ్డాయి. వీటన్నింటినీఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అలాగే మరోవైపు ఏపీలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్కడ కూడా సలీపర్ సెల్ పాగా వేసినట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించాలని డిసైడ్ అయింది. గుంటూరులో ముంబై ఏటీఎస్ దాడులు చేస్తోంది. ఉగ్రవాదులకోసం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.

సయ్యద్ నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ATS తెలిపింది. అవికాకుండా మూడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ జనాలు ప్రాణాలు తీయడానికి వాడాలనుకున్న ఆయుధం రిసీన్ పాయిజన్. ఇదొక జీవ సంబంధమైన టాక్సిన్. అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది మానవుని శరీరంలోకి చిన్న మొత్తంలో వెళ్ళినా కూడా హాని చేస్తుంది. శరీర అవయవాలు దెబ్బ తినడం, ప్రాణాలు పోవడం జరుగుతుంది. దీనికి విరుగుడును కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. అందుకే రిసిన్ ను తయారు చేయడం నేరం కింద పరిగణిస్తారు. ఇందులో మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏటంటే..ఈ విషం ఎందులో కలిపినా కనిపెట్టడం చాలా కష్టం. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. ఆఖరుకి మంచి నీళ్ళల్లో కలిపినా కూడా కనుక్కోలేరు. అందుకే ఉగ్రవాదులు దీనిని ఎన్నుకొన్నట్టు తెలుస్తోంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !