+91 95819 05907

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం లేదు

డాక్టర్లు ఉన్నా వసతులు, పరికరాలు, మందులు లేవు

సిపిఐ(ఎం) ఆద్వర్యంలో హాస్పిటల్ సమస్యలపై సర్వే.

నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు ప్రభుత్వ వైద్యం అందడంలేదని, బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ అవస్థలు పడుతుందని, వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా ప్రజలకు సరైన వైద్యం అందించటానికి డాక్టర్లు ఉన్నా వైద్యం చేయటానికి సౌకర్యాలు, పరికరాలు లేవని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆద్వర్యంలో గురువారం వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలపై సర్వే చేశారు. సిపిఐ(ఎం) బృందం హాస్పిటల్ మొత్తం పర్యటించి వసతులు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ బాలు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆశాజ్యోతి, డాక్టర్ మాధురి, డాక్టర్ విజయ్ కుమార్, వైద్యం కోసం వచ్చిన పేషంట్లతో మాట్లాడి పలు రకాల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టిన వైరా నియోజకవర్గంలో పేదల ప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు ఉన్నా వైద్యం చేయటానికి సౌకర్యాలు, పరికరాలు లేవని, ముఖ్యమైన రక్త పరీక్షలు చేయడానికి శాంపిల్స్ ఖమ్మం పంపించి రిపోర్టు వచ్చేవరకు ఎదురు చూడాల్సిన దుస్థితిలో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందించడం లేదని, డాక్టర్లు, సిబ్బంది కోరత ఉందని, అన్ని రకాల వ్యాధులకు మందులు, ఇంజెక్షన్లు లేవని, మహిళలకు డెలివరీ సమయంలో ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ థియేటర్ లేదని, పసి పిల్లలకు వైద్యం అందించడానికి ఇంక్యుబేటర్ బాక్స్ కూడా లేదని, హాస్పిటల్ బిల్డింగ్ శిధిలావస్థకు చేరిందని, మహిళలకు బాత్రూం సౌకర్యం కూడా లేదని, బాత్ రూమ్స్ లో చెట్లు మోలిసి చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. డెలివరీలు, అత్యవసర వైద్యం చేయకుండా ఖమ్మం పంపుతున్నారని తెలిపారు. వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిధులను వెంటనే కేటాయించాలి, అన్ని రకాల వైద్య సేవలు అందించాలి, డాక్టర్లు, సిబ్బందిని నియమించాలి, ఆపరేషన్ థియేటర్, ఇంక్యుబేటర్ బాక్స్ ఏర్పాటు చేయాలి, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలి కోరారు, 100 పడకల ఆసుపత్రి నూతన భవనం నిర్మాణం పనులు పూర్తిచేసి అని రకాల సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, చిట్టోజు నాగేశ్వరరావు, దేవబత్తిని నాగేశ్వరరావు, గొడ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !