శుక్రవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో విద్యుత్ అంతరాయం
ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు సరఫరా నిలిపివేత; సబ్ స్టేషన్ మరమ్మత్తులే కారణం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 13: అశ్వారావుపేట మరియు దమ్మపేట మండలాల పరిధిలోని పలు ప్రాంతాలలో నవంబర్ 14, శుక్రవారం నాడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అశ్వారావుపేటలోని 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో అత్యవసర సాంకేతిక మరమ్మత్తులు చేపట్టవలసి ఉన్నందున, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేయబడుతుందని ఎన్పీడీసీఎల్ అశ్వారావుపేట ఏడీఈ వెంకట రత్నం తెలిపారు. ఈ అంతరాయం అశ్వారావుపేట, నారంవారిగూడెం, గంగారం, వినాయకపురం, నారాయణపురం సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు వర్తిస్తుంది. కావున, వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 30









