బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు తేలుకుంట్ల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చింతకాని ప్రధాన కూడలి లోని రత్నాకర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాన్నక గోపాలరావు,మండల కోశాధికారి మల్లెల సత్యనారాయణ,నాన్నక రామారావు,మల్లెల వెంకటేశ్వర్లు,కూచిపూడి సతీష్,తాళ్లూరి రాము,పగిడిపల్లి పానకాలు,ఏసుపోగు రాంబాబు,టీడీపీ జానిమియా,ఎన్నేబోయిన వెంకన్న,పొనుగోటి బాబు,యండపల్లి గోపి,పోతురాజు గోపాలరావు మరియు బండి రత్నాకర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 62









