+91 95819 05907

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడులను జరిపి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

• సబ్ రిజిస్టర్ కార్యాలయం పై సడన్ రైట్స్.

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ బృందం ముందుగా ఆ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల కేంద్రాలపై దాడులు ప్రారంభించింది. ప్రతి డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో రికార్డులు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి, అనుమానాస్పద అంశాలను నమోదు చేసింది.

* డాక్యుమెంట్ రైటర్ల వద్ద తనిఖీలు ..మొబైల్స్, రికార్డుల స్వాధీనం

దాడుల సమయంలో ఏసీబీ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లు, కార్యాలయాల్లోని పత్రాలు, సిబ్బంది వ్యక్తిగత ఫోన్లను సీజ్ చేశారు. ముఖ్యంగా నగదు బదిలీ యాప్‌లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అబధ్ధాలు, అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి.

* సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ. 2.90 లక్షల స్వాధీనం

దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రెండు లక్షల తొంభై వేల రూపాయల నగదు లభించింది. సదరు డాక్యుమెంట్ రైటర్ ఆ నగదు తనకు అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వడానికి తీసుకువచ్చినదేనని ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. నగదు మూలానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించినట్టు తెలిసింది. అయినప్పటికీ, ఏసీబీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది.

* రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పరిశీలన ..ఏసీపీ రమేష్ వివరణ

ఏసీబీ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వరుస ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన అన్ని డాక్యుమెంట్లను డాక్యుమెంట్ రైటర్లు ఎలా తయారు చేశారో, ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగిందో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఫోన్లలోని నగదు లావాదేవీల యాప్‌లు, సందేశాలు, కాల్ వివరాలను కూడా చెక్ చేస్తున్నట్లు వెల్లడించారు.

* లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు డబ్బు, వస్తువులు లేదా సేవల రూపంలో లంచం కోరితే వెంటనే నంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఈ నంబరు 24 గంటలు పనిచేస్తుందని అధికారులుఅన్నారు. ఏసీబీ దాడులు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

🔸 ఏసీబీ దాడులతో వైరాలో అలజడి

ఈ అకస్మిక దాడుల కారణంగా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్రమాలు వెలుగులోకి వచ్చే భయంతో పలు మంది డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !