+91 95819 05907

వైరా బోడేపూడి వైద్య శిబిరం విజయవంతం

వైరా బోడేపూడి వైద్య శిబిరం విజయవంతం

125వ నెల 576 మందికి ఉచితంగా వైద్య సేవలు

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని 125వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 576 మంది పేద, మద్యతరగతి ప్రజలు ఉచితంగా వైద్య సేవలు పోందినారు. నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందించారు. బోడేపూడి వైద్య వైద్య శిబిరంపై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు ,కూల్డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షుగర్ పేషంట్స్ గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు చింతనిప్పు చలపతిరావు, బొంతు సమత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, మాదినేని రజిని,
మోదుగు నాగరాణి, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వేంకటేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ, మందడపు నాగేశ్వరావు, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !