ప్రతి పేదంటి కల సొంతఇంటి నిర్మాణం..
ఇద్దరమ్మా రాజ్యంలో పేదలకు ఇళ్లు.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన డిసిసి అధ్యక్షుడు పువ్వాళ..
నేటి గదర్ న్యూస్, వైరా:
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం లోని ముసలమడుగు గ్రామంలో డిసిసి అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.దీనిలో భాగంగా మాట్లాడుతూ ప్రతి పేదెట్టి కల సొంతఇంటి నిర్మాణం ఇలాంటి ఇళ్లను ఇద్దరమ్మా రాజ్యంలోనే సాధ్యమని. ఇది నిరంతర ప్రక్రియని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అందుతుందని వారు అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సత్తెనపల్లి నరసింహారావు డిసిసి అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొలా రంగారావు,మొక్క రాజశేఖర్ గౌడ్,తడికమల్ల నాగేశ్వరావు, గోపాలరావు, శ్రీను,కాటమరాజు,నాగర్జున తదితరులు పాల్గొన్నారు.









