+91 95819 05907

భద్రాద్రి కొత్తగూడెంకు మరో సారి రానున్న తెలంగాణ సీఎం రేవంత్…

భద్రాద్రి కొత్తగూడెంకు మరో సారి రానున్న తెలంగాణ సీఎం రేవంత్….
మంత్రి తుమ్మల
•కొత్తగూడెం లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రండి
•సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం
•డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు
•పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఖచ్చితంగా జిల్లా పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.

డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు

మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ డిసెంబర్ 1 నుండి 8 వరకు ఏ తేదీనైనా కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. అనుకూలమైన రోజు నిర్ణయించుకుని తెలియజేస్తానని సూచించారు.
దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది.

ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ఆదేశం

సీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్య శాఖ సెక్రటరీ శ్రీధర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు, వసతులు, పార్కింగ్, రాకపోకలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని,భద్రత విషయాల్లో లోపాలు లేకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. అతిథుల నిర్వహణ, వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల పరిశీలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

దేశానికే ప్రత్యేక గుర్తింపునిచ్చే వర్సిటీ

కొత్తగూడెం మైనింగ్ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా మారనుందని మంత్రి తుమ్మల తెలిపారు.300 ఎకరాల్లో నిర్మించిన ఈ వర్సిటీ, ఇప్పటికే ఆధ్యునిక ల్యాబ్‌లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వసతులతో నిర్మించారు.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యా రంగం జాతీయస్థాయిలో కొత్త గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల కృషితోనే సాధ్యమైన ప్రాజెక్ట్

మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడం, దానికి భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ పేరును నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషి వల్లే సాధ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో పని చేస్తున్న తుమ్మల కృషికి ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.

యువతకు ఉపాధి – జిల్లాకు అభివృద్ధి

వర్సిటీ ప్రారంభోత్సవం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు,యువతకు పరిశోధనా, ఉపాధి అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పరిశోధన సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. జిల్లాలో విద్య–పరిశ్రమల సమన్వయంతో ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !