*ఆదివాసుల పోడు భూములపై కక్ష్య సాధింపు*
*ఉద్యోగ వృత్తి మర్చిపోయి ఆదివాసీ జాతి ప్రతీకార చర్యకు పాల్పడుతున్న అటవీ అధికారులు*
*లంబాడా అధికారులు తీరు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది-ఆదివాసీ జేఏసీ కరకగూడెం మండల కమిటీ*
నేటి గదర్ కరకగూడెం:మండలంలో లంబాడా ఉద్యోగుల అత్యుత్సాహం చూపిస్తున్నారని కరకగూడెం ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ అన్నారు.అయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లంబాడీ వర్సెస్ ఆదివాసీ కేసును దృష్టిలో పెట్టుకొని కక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్న లంబాడీ ఫారెస్ట్ బీట్ అధికారులు,సెక్షన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.గతంలో అశ్వాపురంపాడు ఆదివాసులపై అక్రమంగా ముగ్గురిపై కేసు పెట్టించి జైలుకి పంపి నెల కూడా కాకముందే మండలంలోని అల్లేరుగూడెం గ్రామంలో మరో ఆదివాసీ కుటుంబం భలి కావడం అశ్చర్యానికి గురిచేసింది. 5వ షెడ్యూల్డ్ భూభాగంలో గిరిజనేతరులు, లంబాడిలు వందల ఎకరాలు ఎటువంటి ఆధారం లేకుండా ఏళ్ళ తరబడి వ్యవసాయం చేసుకుంటున్న నిమ్మకు నీరేతినట్లు ప్రవర్తించే అధికారులు ఈ రోజు 5వ షెడ్యూల్డ్ భూభాగంలో అన్ని అధికారాలు కలిగి ఉన్న అమాయక ఆదివాసులపై బెదిరించి కేసులు పెట్టడం,మీరు వలస వచ్చారు మీకు ఏం ఆధారం ఉంది ఇక్కడి నుంచి వెళ్లిపోండని దౌర్జన్యం చేస్తున్నా కానీ లంబాడీల పక్షాన నిలబడుతున్న మిగతా అధికారులు ఏజెన్సీ భూభాగంలో ఆదివాసుల చట్టాలు హక్కులు కాపాడాల్సిన అధికారులే ఇలా ప్రవర్తిస్తే ఆదివాసుల సమస్యలను ఇంకా ఎవరు పట్టించుకుంటారు. ఇకనైనా వివిధ శాఖల్లో ఉన్నటువంటి లంబాడి అధికారులందరూ మీ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. ఇకనైనా పై అధికారులు ఆదివాసులపై జరుగుతున్న అన్యాయంపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అటవీ డివిజనల్ అధికారులు స్పందించి లంబాడీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) డిమాండ్ చేస్తుందని అన్నారు.









