రోడ్ల గుంతలపై బీఆర్‌ఎస్ పోరు: బుధవారం భారీ నిరసన
జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన; 31 పంచాయతీల రహదారుల దుస్థితిపై మెమొరాండం సమర్పణ.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 18: బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఆదేశాల మేరకు దమ్మపేట మండలంలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ తెలియజేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని 31 పంచాయతీలలో ప్రధాన రహదారులు, అంతర్గత బీటీ రోడ్ల మీద ఉన్న గుంతలు, బాగా దెబ్బతిన్న రోడ్ల వివరాలతో కూడిన మెమొరాండంను ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి, అనంతరం ఎంపీడీఓకి సమర్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కావున, 31 పంచాయతీలలోని పార్టీ శ్రేణులందరూ బుధవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని దొడ్డా రమేష్ విజ్ఞప్తి చేశారు.









