నేటి గదర్ వెబ్ డెస్క్:
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తికి ప్రధాని మోడీ విచ్చేసారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్యా సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో కలిసి భగవాన్ శ్రీ సత్యసాయి సమాధికి పుష్పాలతో అర్చించారు. శ్రీ సత్యసాయి మహా సమాధి, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు.. ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించారు.
Post Views: 209









