బాధితులకు ఫోన్ల అప్పగింత…_
సిఐ వడ్డేపల్లి మురళీ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ముదిగొండతో పాట మండల పరిధిలోని ఆయా గ్రామలకు చెందిన కొందరు ఫోన్లు పోగొట్టుకున్నారు. అందులో 5 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి గురువారం బాధితులకు అప్పగించినట్లు సీఐ మురళీ తెలిపారు. సుమారు సెల్ ఫోన్ల విలువ లక్ష రూపాయలు ఉంటుందన్నారు. సెల్ ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. తమ సెల్ ఫోన్ లను రికవరీ చేసి అప్పగించిన సీఐ మురళీకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిత, ఏఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు_
Post Views: 13









