ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామంలో ముదిగొండ PACS అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ధాన్యం దిగుబడి ఎలా ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు.. రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు..రైతులకు న్యాయమైన మద్దతు ధర,సమాయానికి కోనుగోలు,పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు..ఏ గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర కల్పిస్తుందని,సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుందని చెప్పారు..రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమ్మినేని రమేష్ బాబు,పిఎసిస్ అధ్యక్షులు తూపాకుల యాలగోండ స్వామి,బుల్లేట్ బాబు,వనం బాబు, పుల్లారెడ్డి,చిలకల రామక్రిష్ణ, దేవరపల్లి పుల్లారెడ్డి, జానికిరామ్,పందిరి అంజయ్య,తదితరులు పాల్గొన్నారు..









