ఎర్రుపాలెం మండల ఎస్సీ కాలనీల అభివృద్ది కి భారీగా నిధులు ; ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ; దేవరకొండ శ్రీనివాసరావు
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం మండల ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 21/11/2025
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఆర్థిక ,ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రివర్యులు అయిన శ్రీ భట్టి విక్రమార్క మల్లు కృషితో ఎర్రుపాలెం మండలంలో అన్ని ఎస్సీ కాలనీలకు 8 కోట్ల 49 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేసినారు. గత ఎన్నో దశాబ్దాల కాలంగా దళితవాడలు ఎంతో ఇబ్బందికరంగా, అధ్వానంగా రోడ్లు ఉండటంతో ప్రజాపాలనలో దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు ఎర్రుపాలెం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు శ్రీ దేవరకొండ శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు.
Post Views: 14









