+91 95819 05907

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే జారె

మహిళా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి; ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో చీరల పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) నవంబర్, 23: అశ్వారావుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యున్నతికి, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి, స్వావలంబనకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. ఆదివారం అశ్వారావుపేట మండలం వినాయకపురం, ములకలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరఫున చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా మహిళలకు చీరలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. అన్ని రంగాలలో మహిళలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అంతకుముందు, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో సత్యసాయిబాబా దేవాలయాన్ని సందర్శించి శతజయంతి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా, ములకలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలలో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, తాండ్ర ప్రభాకర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, జూపల్లి రమేష్, బత్తుల అంజి, కారం సుధీర్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !