+91 95819 05907

అరటి తోట భూ వివాదం -ఇద్దరిపై కత్తిపోట్లు, పరిస్థితి విషమం

అరటి తోట భూ వివాదం -ఇద్దరిపై కత్తిపోట్లు, పరిస్థితి విషమం

నారంవారి గూడెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ; ఆసుపత్రికి తరలింపు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తమైంది. కత్తిపోట్లకు గురైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నారంవారిగూడెం గ్రామానికి చెందిన మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ అనువర్లు అనే వ్యక్తులు శ్రీహరి అనే వ్యక్తి నుంచి ఐదెకరాల పొలాన్ని కొనుగోలు చేసి, అందులో అరటి తోట వేశారు. అయితే, అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు అనే వ్యక్తి ఆ భూమి తమదేనంటూ తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించి, అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ భూ వివాదంపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు, కానీ సమస్య ఒక కొలిక్కి రాలేదు. తాజాగా, గేదెల విష్ణు తమ కుమారుడు గేదెల సురేష్‌కు చెందిన అరటి తోటను నరుకుతున్నారని ఆరోపిస్తూ మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే పొలంలో ఉన్న గేదెల విష్ణు కుటుంబ సభ్యులతో వారు మాట్లాడుతుండగా, ఒక్కసారిగా ఇరుపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలతో పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, గేదెల విష్ణు మనవడు గేదెల వినయ్ కత్తితో మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్‌పై దాడి చేశాడు. కత్తిపోట్ల కారణంగా మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ తలకు తీవ్ర గాయాలై, రక్తం ఎక్కువగా పోవడంతో అక్కడే కుప్పకూలారు. స్థానికులు వారిని వెంటనే అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మంకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !