ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: సంక్షేమ పథకాలతో ప్రజల నమ్మకం గెలుచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తిరుమలకుంటలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం; సీఎం రేవంత్‌రెడ్డి ప్రగతి పథకాలకు కట్టుబడి ఉన్నామని నేతల వ్యాఖ్య
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయతీలో సోమవారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత సీసీ సత్యనారాయణ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగతి పథకాలతో ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, గౌరవప్రద జీవనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామదీపికలు మామిడి వెంకమహాలక్ష్మి, జుజ్జురి రేఖ, హైమ, దీపికా, కాంగ్రెస్ నాయకులు జుజ్జురి దుర్గారావు, కోర్సా రాజేష్, టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య, బొడ్డు సత్తిబాబు, చేవల మహేష్, కొనాకళ్ల లచ్చియ్య, గడ్డం యేసు, కొనా రోశయ్య, కొనా లక్ష్మణ రావు, మరియమ్మ, తరుణ్, నాగు, మనోహర్, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









