సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి.
మెదక్ కాంగ్రెస్ నాయకుల అభినందనలు.
నేటి గదర్ మెదక్ ప్రతినిధి (భూపాల్ మాదిగ) నవంబర్ 26.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన ఆంక్షా రెడ్డి ని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడ్డ భాగ్యరాజ్ మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ మహిళల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని,ఆ దిశగా అంక్షా రెడ్డి వంటి యువ ధైర్యవంతమైన నాయకులు పార్టీకి బలం చేకూరుస్తారని పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు అంక్షా రెడ్డి పోషిస్తున్న పాత్ర ఆదర్శప్రాయమని, ఆమె కొత్త పదవిలో ప్రజలకు మరింత చేరువవుతూ సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి,నాచారం గుట్ట చైర్మన్ రవీందర్ గుప్తా,బాలేష్ గుప్తా, సి ఆర్ జానకిరాములు,ఆశాజ్యోతి మల్లేశం,సిద్ధి రాములు,లంబు వెంకటేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.









