బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్య.
బీసీ లకు అన్యాయం జరిగితే సహించేది లేదు : బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శీలం పాపారవు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : తెలంగాణ లో రానున్న స్థాన క సంస్థల ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ విధానం లోపభూయిష్ట గా ఉందని దుయ్యబట్టరు . తెలంగాణా లో 50శాతం కి పైగా జనాభా ఉన్న బీసీ లకు కేవలం 17 శాతం రిజర్వేషన్ కేటాయించి ఆరోపించారు . రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42 శాతం ఇస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు అసలుకే మోసం చేసి తీవ్రమైన అన్యాయం చేసిందని అన్నారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఒక్క సర్పంచ్ స్థానానికి కూడా బీసీ కేటాయించకపోవడం , రాష్ట్రం లోని కొన్ని మండలాలో సర్పంచ్ స్థానాలలో ప్రాతినిధ్యం బీసీ లకు లేకపోవడం ఇదెక్కడి రిజర్వేషన్ విధానం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు . ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో బీసీ లు మీకు తగిన బుద్ధి చెబుతారాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు .









