+91 95819 05907

మాజీ మావోయిస్టు హ*త్య ◆సిద్దన్న ప్రస్తుతం BRS పార్టీ నాయకుడు

మాజీ మావోయిస్టు హ*త్య
– సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో ఘటన
– సంచలనం సృష్టించిన మ*ర్డర్
– సిద్దన్న ప్రస్తుతం BRS పార్టీ నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య అలియాస్ (58) గురువారం సాయంత్రం హ*త్యకు గురయ్యారు. వేములవాడ శివారు లోని అగ్రహారం గుట్టల్లో సిద్దన్నను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు హ*త్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పీపుల్స్ వార్ సిద్ధన్నగా పేరుగాంచిన నర్సయ్య దశాబ్దకాలం పాటు ఉద్యమంలో పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుపరిచితులైన సిద్ధన్న హ*త్యకు గురికావడం సంచలనం సృష్టించింది. 1997 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ(ఇప్పటి మావోయిస్టు) లో పనిచేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ సిద్ధన్న ఇంటర్వ్యూ ఇస్తూ.. జగిత్యాల జిల్లాకు చెం దిన ఫలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హ*త్య చేసినట్లు చెప్పారు.

యూట్యూబ్ చానల్ ఇంటర్వూను చూసిన సదరు హ*త్యకు గురైన వ్యక్తి కొడుకు సంతోష్ సిద్ధయ్యపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హ*త్య చేయాలని భావించినట్లు సమాచారం. ఇటీ వల సిద్ధన్నతో స్నేహం చేసినట్లు తెలిసింది. మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తు న్నారు.. మీరంటే నాకు ఎంతో అభిమానమంటూ నమ్మబలికాడు. ఈక్రమంలోనే సిరిసిల్లకు వస్తూ సిద్దన్నను కలుస్తూ పోతున్నట్లు సమాచారం.

గురువారం వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లి సిద్ధన్నపై బండ*రాళ్లు ఎత్తేసి హ*త్య చేసినట్లు తెలిసింది. సంతోష్ పోలీసులకు లొంగిపోయి ఈ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృ*తుడు సిద్ధన్నకు ఇద్దరు భార్యలు పోచవ్వ, ఎల్లవ్వ, ముగ్గురు పిల్లలు అశోక్, నరేశ్, పద్మ ఉన్నారు. సిద్ధన్న హ*త్యకు గురైనట్లు తెలిసిన కుటుంబ సభ్యులు గం డిలచ్చపేట నుంచి బయలుదేరి వేములవాడకు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోవర్టు హ*త్యాకాండలో భాగస్వామి

అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య ఆదేశాలతో 2003లో తొమ్మిది మంది దళసభ్యులను పీపుల్స్ వార్ పార్టీ కోవర్టుకు పాల్పడ్డారని హ*త్య చేశారు. కోనరావు పేట మండలం వట్టిమల్ల-మరిమడ్ల శివారుల్లో ఆరుగురిని, మానాల శివారులో ముగ్గురిని పీపుల్స్ వార్ నక్సలైట్లు హ*తమార్చారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిద్ధన్న ఈ సంఘటన కలిసి వేసిందని, తొమ్మిది మంది సహచరులను ఏక కాలంలో చం*పడం బాధ అనిపించిందని సిద్ధన్న ఇంటర్వ్యూలో చెప్పారు.

అంతకుముందు వీర్నపల్లి మండలం మద్దిమల్ల ఎన్ కౌంట*ర్లోనూ సిద్ధన్న తప్పించుకున్నారు. 2004లో పోలీసులకు లొంగిపోయారు. సొంతూరు గండిలచ్చపేటలో నివాసం ఉంటున్నారు. దశాబ్ద కాలం పాటు పీపుల్స్ వార్ లో పనిచేసిన సిద్ధన్న చివరికి ఇలా హ*త్యకు గురికావడం సంచలనం సృష్టించింది. సంతోష్ ఒక్కరే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇంకా ఎవరై నా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !