+91 95819 05907

డిసెంబర్ 3న.. హైద్రాబాద్ లో మహా ధర్నా..!

డిసెంబర్ 3న.. హైద్రాబాద్ లో మహా ధర్నా..!

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

-పుష్కర కాలంగా పరిష్కారం కాని జర్నలిస్టుల సమస్యలు.

-మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలి.

– ప్రెస్ మీట్ లో టీ యు డబ్ల్యూ జె (ఐ జె యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ్ నారాయణ
_ పాల్గొన్న జిల్లా, రాష్ట్ర నాయకులు, జర్నలిస్టులు
ఖమ్మం :
రాష్ట్రంలో గత 12 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం పై నిరసన వ్యక్తం చేస్తూ డిసెంబర్ 3న హైద్రాబాద్ లోని మసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోల రామ్ నారాయణ తెలిపారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి, నర్వనేని వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు, కార్యదర్శి మైస పాపారావు, మాజీ జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పుష్కర కాలంగా జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని రామ్ నారాయణ ఆరోపించారు. మాటలకే పరిమితం అయ్యాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ ల సమస్య లను వెంటనే పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్నా మాటలతో కాలం గడుపుతూ జర్నలిస్టుల సమస్యలును పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్న గాని, సమాచార శాఖ మంత్రి కూడా జిల్లాకు చెందిన వారు ఉన్నా గాని, జర్నలిస్ ల సమస్యలు పరిష్కారం విషయంలో మాటలకే పరిమితం అయ్యారని వాపోయారు.
జర్నలిస్టు ల సమస్య లైన అక్క్రిడిటేషన్ కార్డులు మంజూరు, హెల్త్ కార్డుల పంపిణి, ఇంటి స్థలాలు కేటాయింపు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో జర్నలిస్ట్ లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహా ధర్నా పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ ప్రెస్ మీట్ లో యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల భూపాల్, మహేందర్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి జనార్ధన చారి, కోశాధికారి ఏలూరు వేణుగోపాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కార్యదర్శి శీలం శ్రీనివాస్, కోశాధికారి కళ్యాణ్, మేడి రమేష్, కెమెరా జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆలస్యం అప్పారావు, ఫోటో జర్నలిస్టుల అధ్యక్షుడు కమటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !