#మణుగూరులో_ఫారెస్ట్ఆఫీసర్ల_అక్రమవసూళ్లు
#కలెక్టర్అనుమతి_ఇచ్చారంటూ_బొగ్గులారీలునిలిపివేత
తమకు కలెక్టర్ అనుమతి ఇచ్చాడంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు సింగరేణి నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలను అడ్డుకొని వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో లారీ యజమానులు బొగ్గు రవాణాను నిలిపివేశారు. మణుగూరు మండలంలోని ఓసి 4 మైన్ నుంచి బిటిపిఎస్ కు బొగ్గు రవాణా చేస్తున్న లారీలను జిఎం ఆఫీస్ సమీపంలో గురువారం ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఫారెస్ట్ ఏరియా నుంచి నడిచే లారీలనుంచి రాయల్టీ వసూలు చేసుకునేందుకు కలెక్టర్ తమకు అనుమతి ఇచ్చాడంటూ లారీలను అడ్డుకొని ఒక్కో లారీ నుంచి రూ 200 వసూలు చేస్తున్నారు. దీంతో లారీ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మణుగూరు సిఐ నాగబాబు కు సమాచార అందించగా ఆయన అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు వసూళ్లలో ఎటువంటి చట్టబద్ధత లేదని లారీలను అడ్డుకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించి లారీలను పంపించి వేశారు. దీనిపై ఎఫ్డిఓ మక్సుద్ ను వివరణ కోరగా లారీల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఫారెస్ట్ నుండి వెళ్లే ఇసుక లారీలకు మాత్రమే వసూలు చేసేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చాడని తెలిపారు.ఏకో సెన్సిటివ్ జోన్ కావడంతో చెస్ వసూలు చేసేందుకు అనుమతులు వచ్చాయన్నారు. సుందిళ్ల, మణు గూరు ఏరియాలో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని అవగాహన కోసం చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి లారీ యజమానులకు వివరిస్తామని తెలిపారు. ఈరోజు జరిగిన సంఘటనపై విచారణ చేపడతామని తెలిపారు.









