యన్. యం. యం. ఎస్.పరీక్ష కీ పై ఏమైనా అభ్యంతరాలుంటే
డిసెంబర్ 6 లోగా తెలపాలి… ఖమ్మం జిల్లా విద్యా శాఖ అధికారిణి చైతన్య జైని.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (యన్.యం.యం.ఎస్.) 8వ తరగతి పరీక్ష యొక్క కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 లోగా సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
https://bse.telangana.gov.in వెబ్సైట్ లో కీ అందుబాటులో ఉన్నదని, అభ్యంతరాలుంటే dirgovexams.tg@gmail.com కు పంపాలని, డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణ, హైదరాబాద్ వారికి నేరుగా సమర్పించవచ్చని, డిసెంబర్ 6 తర్వాత వచ్చే అభ్యంతరాలు పరిశీలించబడవని డిఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Post Views: 22









