సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు…_
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని చింతకాని ఎస్ఐ వీరేందర్ హెచ్చరించారు.స్థానిక సంస్థల ఎన్నికలపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు._
_ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్పచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నటలు చెప్పారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు హాని కలిగించవద్దన్నారు..
Post Views: 31









