ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
ప్రభుత్వ పరమైన ఫలాలు పొందటమే మీ హక్కు- తహసీల్దార్ బాబ్జి
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలం మండల పరిధిలో స్థానిక నరసింహపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా నరసింహ పురం ఎస్సీ కాలనీ లో సభను ఏర్పాటు చేసినారు. పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసిల్దార్ బాబ్జి ప్రసాద్ మాట్లాడుతూ. ప్రభుత్వ పరమైన ఫలాలు పొందటం మీ హక్కు అని అన్నారు. మరియు చదువు లేక ప్రభుత్వ పథకాలు పట్ల అవగాహన లేక ఎన్నో ప్రభుత్వ పథకాలకు ఈ గిరిజన ప్రజలు దూరమవుతుoన్నారు అని . భారత రాజ్యాంగం నందు మీ కొరకు పొందుపరిచిన రిజర్వేషన్లు,ప్రత్యేకంగా కేటాయించిన పథకాలు మీ హక్కుగ భావించాలని తెలియజేసినారు..
Post Views: 64









