నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలపై ఈడీ కొత్త FIR నమోదు!
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు కుట్ర, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈడీ ప్రకారం, కేవలం ₹50 లక్షలు చెల్లించి, ఏజేఎల్‌కు చెందిన ₹2,000 కోట్ల ఆస్తులపై యంగ్ ఇండియా అక్రమంగా అధికారం సాధించినట్టు ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్‌కు ఇచ్చిన ₹90 కోట్ల రుణాన్ని ఉపయోగించి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా అభియోగాలు ఉన్నాయి.
ఎన్నికల టికెట్లు, పదవుల హామీలు, వ్యాపార రక్షణ పేరుతో అక్రమ నిధులు సేకరించినట్టు ఈడీ పేర్కొంది.
🔸 Note: ఎన్నికల టికెట్లు, పదవులు, హామీల కోసం అక్రమంగా నిధులు సేకరించినట్టు ఆరోపణలు రుజువైతే… తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది నేతలకు ఈడీ నోటీసులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చ.
Post Views: 10









