సర్పంచిగా గెలిపించండి ఇచ్చిన హామీలు అన్నీ నేరవేరుస్తాను.
*చిరుమళ్ళ గ్రామపంచాయతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందా ఉమామహేశ్వరి*
నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉమామహేశ్వరి ఆ ప్రాంత ప్రజలకు హామీల వరాల జల్లు ప్రకటించారు.అందులో ముఖ్యమైనవి
మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందించడం,
ఈ పంచాయతీలో ఏ ఇంట్లో పెళ్లి జరిగిన చందా నరసింహారావు గారి ట్రస్ట్ నుండి 5000 రూపాయలు అందించడం ,
ఈ పంచాయతీలో ఏ కుటుంబంలో వ్యక్తి మరణించిన ఆ కుటుంబంలో తన వంతు సహాయంగా 3000 రూపాయలు అందించడం,
ఈ ప్రాంతానికి సంబంధించి చెరువులలో మోటార్లు వేయించి చెరువులలో నీళ్లు కాపాడుకునేలా చేసి తద్వారా రైతులకు నీటి ఎద్దడి లేకుండా చేయడం, వర్షాకాలం వరద ముంపు గ్రామాలను గుర్తించి ఆ నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించడం.
నిరంతరం వీధిలైట్లు వెలిగేలా చూడటం ,
ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా మరణించినప్పుడు దూరపు బంధువులు వచ్చేవరకు అమృతదేహానికి రక్షణగా రిఫ్రిజిరేటర్ సౌకర్యం కల్పించడం ,
పేద విద్యార్థులకు పై చదువులకు వెళ్లలేక ఉన్నవారికి పై చదువుల నిమిత్తం ఆర్థిక క్రసహాయం చేయడం.
క్రీడలలో నైపుణ్యం చూపుతున్న యువతను ప్రోత్సహించడం.
గ్రామాలలో చేపలు పెంచుటకు కుంటలు తవ్వించడం వంటి హామీలు ఇచ్చారు. అలాగే
మా కుటుంబం పేదల పక్షాన ఉండే కుటుంబం ఆనాడు మా మామ చందా నరసింహారావు ఈ ప్రాంత ప్రజలకు చేసిన మేలు ప్రతి ఒక్కరికి కళ్ళముందే ఉందని అన్నారు.అలాగే ఈనాడు నా భర్త అయిన చందా మధు అదే పేదల పక్షాన నిలబడి పేదల పక్షాన పోరాడుతున్న వ్యక్తి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలునైన ఉమామహేశ్వరి అనే నన్ను ఈ ఎన్నికలలో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తారని కోరుతున్నాను అని అన్నారు.









