+91 95819 05907

వైరాకు చెందిన ముగ్గ మురళి కృష్ణకు పీహెచ్.డి

వైరాకు చెందిన ముగ్గ మురళి కృష్ణకు పీహెచ్.డి

కెరీర్ పాయింట్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం

ముగ్గు మురళీకృష్ణ పీహెచ్‌.డి ఔషధ విశ్లేషణలో కీలక అడుగు

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా పట్టణానికి చెందిన ముగ్గు వెంకటేశ్వరరావు (లేట్) శారాధాదేవి దంపతుల కుమారుడుముగ్గు మురళి కృష్ణ ఔషధ రంగంలో కీలక విశ్లేషణ చేసి పీహెచ్.డీ సాధించడం వైరా పట్టణానికి గర్వకారణం. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా, నర్సరావుపేటలో ఉన్న ఏ.ఎం. రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ముగ్గు మురళీకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకమైన పీహెచ్‌.డి. (డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను విజయవంతంగా అందుకున్నారు. రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న కెరీర్ పాయింట్ యూనివర్శిటీ నుండి ఆయన ఈ పరిశోధనను పూర్తి చేశారు. 2025 నవంబర్ 27వ తేదీన యూనివర్శిటీ ఆయనకు అధికారికంగా డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ముగ్గు మురళీకృష్ణ సమర్పించిన పరిశోధనా పత్రం యొక్క శీర్షిక “ఎంచుకున్న కొన్ని యాంటీ-హైపర్‌టెన్సివ్, యాంటీ-వైరల్ ఔషధాలు మరియు వాటి మిశ్రమ ఔషధ మోతాదు రూపాల నిర్ధారణ కోసం విశ్లేషణాత్మక పద్ధతి యొక్క అభివృద్ధి మరియు ధృవీకరణ” ఈ అధ్యయనం అధిక రక్తపోటు, వైరస్ నిరోధక చికిత్సలలో ఉపయోగించే కీలకమైన ఔషధాల యొక్క ఖచ్చితమైన, సమర్థవంతమైన విశ్లేషణాత్మక ప్రమాణాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఈ పద్ధతులు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో నాణ్యతా నియంత్రణ, భద్రతకు దోహదపడతాయి. మురళీకృష్ణ పరిశోధనను ప్రొఫెసర్ టి. రాజకుమారి, ప్రొఫెసర్ కుమారస్వామి సంయుక్తంగా పర్యవేక్షించారు. వారి మార్గదర్శకత్వంలో, ఈ అధ్యయనం ఔషధ విశ్లేషణ రంగంలో ఒక ముఖ్యమైన ముద్ర వేసింది.
ప్రస్తుతం డా. ముగ్గు మురళీకృష్ణ పనిచేస్తున్న ఏ.ఎం. రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క కాలేజ్ మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్, పలువురు సిబ్బంది ఆయన ఘన విజయాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ డాక్టరేట్ సాధన కళాశాల కీర్తిని పెంచడమే కాకుండా, విద్యార్థులకు, ఇతర అధ్యాపక సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు ప్రముఖులు అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !