+91 95819 05907

మల్కారం సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి మెచ్చు లలిత

మల్కారం సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి మెచ్చు లలిత

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, డిసెంబర్, 01: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా దమ్మపే మండలం, మల్కారం గ్రామ పంచాయతి లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో శ్రీమతి మెచ్చు లలిత సోమవారం భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అంకత ఉమ మహేశ్వర రావు మరియు మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి లు దగ్గరుండి పర్యవేక్షించారు. నామినేషన్ ప్రక్రియ మల్కారం గ్రామంలోని శ్రీ రామలయం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అక్కడి నుండి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి మెచ్చు లలిత వెంట బారీ ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సర్పంచ్ పదవి కోసం ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీమతి మెచ్చు లలిత గెలుపు మల్కారం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రూప్ సింగ్, పార్టీ ముఖ్య నాయకులు బత్తుల మురళి, కొండ్రు మురళి, నాగేందర్రావు, తోట మోహన్రావు, మెచ్చు ప్రసాద్, చిట్రూతుల రాము, నల్లపు మోహన్ రావు, వనపర్తి లక్ష్మణరావు, వంకా రాము, మడివి బాబు, ఆకివీడు సుబ్బారావు తో పాటు మల్కారం గ్రామపంచాయతీ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !