చేగుంట సర్పంచ్ అభ్యర్థి మాసుల పుష్పలత శ్రీనివాస్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) డిసెంబర్ 1.
మెదక్ జిల్లా చేగుంట గ్రామం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాసుల పుష్పలత శ్రీనివాస్ సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చేగుంట గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు తనకు ఆశీస్సులు అందివ్వాలని అన్నారు.గ్రామంలోని శ్రీ శ్రీ ఉజ్జయిని
మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
నిర్వహించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్
వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
నన్ను గెలిపించండి నేను చేగుంట గ్రామాన్ని అభివృద్ధి
చేసి చూపిస్తా అని అన్నారు.మంచి కార్యచరణతో
గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని,
సర్పంచ్ అభ్యర్థి మాసుల
పుష్పలత శ్రీనివాస్
గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎవ్వరికీ ఏ
అవసరం వచ్చినా, తను ముందు
ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో
మాసుల శ్రీనివాస్, దాసోజు కృష్ణమూర్తి,
కట్ట జనార్దన్, జలాల్పూర్ శంకర్, ముప్పిరి రవీందర్, చిట్టబోయిన రామచందర్, గడ్డమీద దేవేందర్, చిట్టబోయిన రఘుపతి,
పెద్ద ముత్యాలు, చింతాలు సిద్దిరాములు
తదితరులు పాల్గొన్నారు.









