ప్రేమ జంట – సర్పంచ్ ఎన్నికల్లో ట్విస్ట్!
సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో, బీసీ యువకుడు చంద్రశేఖర్ గౌడ్ తన ప్రేయసి శ్రీజకు నామినేషన్ వేయించాడు.
శ్రీజ తల్లిదండ్రులు నిరాకరించడంతో, ప్రేమజంట రాత్రికిరాత్రే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంది.
“నేను మేజర్‌ని… నా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను. దయచేసి ఇబ్బంది పెట్టొద్దు” అని శ్రీజ తల్లిదండ్రులకు సందేశం.
ఇక ఎన్నికల వేదికపై శ్రీజ ధైర్యంగా చెప్పారు:
“నా భర్త సహకారంతో గెలుస్తాను.”
“ప్రజలు నమ్మితే గ్రామాభివృద్ధి కోసం కష్టపడతాను.”
ఇదే సమయంలో, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రేమదంపతులకు ఓపెన్ సపోర్ట్ ఇచ్చేశారు.
ప్రేమ, రాజకీయాలు, రిజర్వేషన్—తాళ్లపల్లి సర్పంచ్ ఎన్నిక ఇప్పుడ హాట్ టాపిక్ అయింది
Post Views: 14









