ఎంపీలు వద్దిరాజు, సురేష్ రెడ్డి,దీవకొండ,బండి రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావు,రాజ్యసభలో వారి సహచర సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిలు ఛైర్మన్ సీ.పీ.రాధాకృష్ణన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఉప రాష్ట్రపతిగా ఉన్న వారే రాజ్యసభ ఛైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారన్న విషయం తెలిసిందే.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు మంగళవారం ఛైర్మన్ ఛాంబర్ లో రాధాకృష్ణన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 14









