+91 95819 05907

జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు.

జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత…
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు.. .

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….

దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది

దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం

సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభించి దేశ స్వాతంత్ర్యంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించింది

నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృషి చేశారు

తిరిగి పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైంది

అందుకే మల్లికార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను బోర్డు డైరెక్టర్లుగా నియమించి పత్రికను పునరుద్ధరించింది

ఇందులో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదు

నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పత్రికను నడిపారు

దీన్ని మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధిస్తున్నారు

ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు

ఆవిషయాన్ని దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నాం

సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలబడతామని, అవసరమైతే ఎందాకైనా పోరాడతామని సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వదలచుకున్నాం

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి

ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

కోటి మందికి కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నాం

ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే

గ్రామలవారీగా సమన్వయం చేసుకుంటూ పంపిణీ పూర్తి చేయాలి

డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలి

మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలి

ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పరిపాలనపై గ్రామ గ్రామాన చర్చ పెట్టండి

సంక్షోభంలో మనకు రాష్ట్రాన్ని అప్పగిస్తే… సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం

2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

ఈ నెల 7 న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం

ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ యూనివర్సిటీగా తీర్చి దిద్దుతాం

8,9 న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం.

కోర్ అర్బన్ లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని CURE చేయాలని నిర్ణయించుకున్నాం

కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తాం

రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) ప్రాంతంలో పరిశ్రమలకు ఏర్పాటు చేసుకోబోతున్నాం

రీజనల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ ( RARE) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోబోతున్నాం

తెలంగాణలో మరో నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నాం

కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నాం

పనులు చేయడమే కాదు… రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి

మనం చేస్తున్న పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి.

రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు

రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజం.. అది పెద్ద సమస్యగా భావించొద్దు

అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !