+91 95819 05907

సైబర్ మోసాల పట్ల అప్రమత్తం: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తం: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆటోల ద్వారా మైక్ ల ద్వారా మాల్స్, రైల్వే స్టేషన్స్ బస్టాండ్, రద్దీ ప్రాంతాలలో సైబర్ నేరాలపై ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు

ప్రధనంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అదేవిదంగా నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లు, వెబ్ సైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, వాట్సాప్. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ..మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి మోసపురిత ఆఫర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మోసగాళ్లు పెద్ద కంపెనీ IPO వచ్చిందని నమ్మదగిన ప్రకటనలు, నకిలీ వెబ్ సైట్ లు సృష్టిస్తారు. ఆ లింక్ లేదా ఫారమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు, Aadhaar, PAN లేదా UPI ద్వారా చెల్లింపులు చేయమని చెబుతారు. డబ్బు బదిలీ చేసిన తర్వాత మోసగాళ్లు వెబ్ సైట్ మూసేసి మాయం అవుతారు.కొన్నిసార్లు నకిలీ షేర్ సర్టిఫికేట్లు లేదా రసీదులు కూడా పంపి మోసం చేస్తారు.

సోషల్ మీడియా, వ్యక్తిగత మెసేజ్ ల ద్వారా వచ్చిన IPO ఆఫర్లను నమ్మవద్దని,
ఎవరైనా ముందుగా “అడ్వాన్స్ పేమెంట్” లేదా “రిజిస్ట్రేషన్ ఫీజు” అడిగితే డబ్బు పంపవద్దని సూచించారు. తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తాయని సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ గ్రూపులు లేదా టెలిగ్రామ్ ఛానెల్ ల ద్వారా “రోజుకు వేలల్లో లాభం”, “100% రిటర్న్” అంటూ ప్రకటనలు చేస్తారు. మొదట యాప్ లేదా వెబ్ సైట్లో రిజిస్టర్ చేయమని చెబుతారని, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభం చూపించి నమ్మకం కలిగిస్తారని అన్నారు. ఆ తరువాత పెద్ద పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. విత్ డ్రా చేయాలంటే “ట్యాక్స్”, “సర్వీస్ చార్జ్” పేరుతో డబ్బు అడుగుతారు. చివరికి వెబ్ సైట్ లేదా యాప్ యాక్సెస్ నిలిపివేసి, డబ్బుతో మాయమవుతారని అన్నారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయండి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !