✴️ దేశ ప్రతిపక్షాల మెడలో కట్టిన భారీ మొద్దు రాహుల్ గాంధీ నాయకత్వం
✴️ రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుపైన విజన్ లేదు
✴️ జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా విఫలమైంది
✴️ మోడీకి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం
✴️ ఏనాటికైనా ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రత్నామ్నాయం
✴️ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది
✴️ చెన్నైలో ఈరోజు జరిగిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘ఇగ్నీషన్’ (IGNITION) సదస్సులో పాల్గోన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
🔸జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
🔸బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించడంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
🔸దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం మారారని అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని, మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదు అన్నారు.
🔸దేశంలోని ఆర్థిక వ్యవస్థ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన, ఇన్నోవేషన్ పైన, పారిశ్రామిక ప్రగతి పైన రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ఏనాడు చూడలేదని కేటీఆర్ అన్నారు.
🔸ఈ అంశాలు రాహుల్ గాంధీకి ఒక విజన్ ఉన్నట్లు అనిపించడం లేదు అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అవుతుందని అన్నారు.
🔸బీహార్ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీ లాంటి కాంగ్రెస్.. అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికి వేయడం వల్లనే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని అన్నారు.
🔸గతంలో కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీల వేదిక ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు. దేశంలోని ప్రతిపక్షం మెడలో కట్టిన పెద్ద మొద్దు లెక్కన రాహుల్ గాంధీ నాయకత్వం తయారైంది అన్నారు.
🔸అందుకే వరుసగా ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతూ వస్తుందన్నారు. రాహుల్ గాందీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కనీసం లక్ష కోట్ల ప్రాజెక్ట్ వ్యయం లేని కాలేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం అయన అజ్ఝానానికి నిదర్శం అన్నారు.
🔸దక్షిణాన భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉందని అనుకోవడం లేదన్న కేటీఆర్, రానున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి బలమైన పాఠం చెప్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
🔸బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవెర్చడంలో తీవ్రంగా మోసం చేసిందని, బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
🔸బీజేపీ పది సంవత్సరాల్లో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లిందని, అయితే బిజెపి విభజన రాజకీయాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా మేము విఫలం అయ్యామని కేటీఆర్ అన్నారు.
🔸చెన్నైలో ఈరోజు జరిగిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘IGNITION’ సదస్సులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
🔸ప్రముఖ జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సులో “రిబూటింగ్ ది రిపబ్లిక్” (Rebooting the Republic) అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
🔸దేశాభివృద్ధిలో రాజకీయాలు మరియు టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
🔸తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలపైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాల పాటు అనేక రంగాల్లో ముఖ్యంగా ఆర్థిక ప్రగతి అద్భుతంగా సాధించిన తెలంగాణ రెండు సంవత్సరాల్లో వెనుకబడడం బాధాకరమన్నారు.
🔸మంచిగా నడుస్తున్న వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేసినందుకే రాష్ట్రం ప్రస్తుతం వేగంగా ముందుకు పోవడం లేదన్నారు. ఒకప్పుడు థామస్ పెయిన్.. ప్రభుత్వాల నుంచి ప్రజలను కాపాడుకోవడమే దేశభక్తుల యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణలోని పరిపాలనను చూస్తే గుర్తుకు వస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
🔸కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచాకాల నుంచి పార్టీని కాపాడుకోవాల్సి వస్తుందన్నారు.









