నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 3.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తానని రైతును వేధించి, లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ శ్రీనివాస్ ఎసిబి అధికారుల వలలో చిక్కాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం ఒక రైతు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాల పరిశీలన, భూసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తానని చెప్పి సర్వేయర్ ₹20,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బాధిత రైతు ఎసిబిని ఆశ్రయించగా, ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చు ఆపరేషన్‌లో సర్వేయర్‌ను లంచం తీసుకుంటున్నంగా పట్టుకున్నారు.
Post Views: 99









