నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) డిసెంబర్ 04.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని స్టేషన్ మాసాయిపేట్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా ఎర్వ శీను అలియాస్ స్టేషన్ శీను తమ నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎర్వ శ్రీనివాస్ అలియాస్ స్టేషన్ శీను మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే స్టేషన్ మాసాయిపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామముంగా, ఆభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్, లక్ష్మణ్, రాములు, జాఫర్, నర్సింగరావు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 297









