*డప్పు చప్పులతో పట్టణ కేంద్ర లో భారీ ర్యాలీ*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ ) డిసెంబర్ 04.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గా చిట్టీమిల్ల నాగరాజు,తమ నామినేషన్ను దాఖలు చేశారు. గురువారం తన నివాసం నుండి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, టపాసులు పేలుస్తూ ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం ఎన్నికల అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆశీస్సులతో పట్టణాన్ని ఆదర్శ పట్టణముగా , పట్టణాభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు డి, శ్రీనివాస్,మటన్ పవన్, సర్గం రమేష్, స్వామి, రమేష్, మహేష్, బాబు దశరథ, సంతోష్ కుమార్, దుర్గ స్వామి,నహిని శ్రీనివాస్ గౌడ్,లక్ష్మణ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.









