తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని నాగరాజు గెలుపు కాంక్షిస్తూ శుక్రవారం ముమ్మరంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు , తాత నిర్మల , వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పమ్మి అశోక్ , వైరా పట్టణ కాంగ్రెస్ నాయకులు వీరంశెట్టి సీతారాములు , తెళ్ళురి వీరయ్య మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్దఎత్తున తాడిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని నాగరాజు గెలుపు కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తాటిపూడి గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. అదేవిధంగా అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీలు అనేక మౌలి క వషతలను కల్పిస్తూ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఇప్పుడు జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరినారు.









