సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత.
వేద పాఠశాలకు సేవలందిస్తా
డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా లోని సత్యసాయి స్మార్త వేద పాఠశాలలో ఖమ్మం జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు నూతి సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులు విజయవాడ కృష్ణ విజయదుర్గ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రౌతస్మార్థ విద్యా మహాసభ ప్రతిభ పరీక్షల్లో కృష్ణ యజుర్వేద స్మార్త పంచదశ కర్మంతమ మంచి ప్రతిభ ఘనపరిచిన ఉత్తమశ్రేణు లు కావూరి శివశర్మ బండి రుణ రోహిత్ శర్మకు నూతి సత్యనారాయణ సర్టిఫికెట్స్ అందజేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ ముందు కూడా ప్రతిభ ఘనపరిచి వేద పాఠశాలకు విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు వేద పాఠశాల కావలసిన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు దమ్మాలపాటి ప్రభాకర్ రావు భాస్కరరావు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ, వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు,లయన్స్ కంటి హాస్పటల్ నిర్వాహకులు ఉండ్రు శ్యాంబాబు, కన్యదారి, హనుమాయమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, ముళ్ళపాటి సీతారాములు, మరికంటి రాంగోపాల్, వీరంశెట్టి సీతారాములు,పెద్దప్రోలు లక్ష్మయ్య,పమ్మి అశోక్,వేద పాఠశాల పండితులు దుర్భాకుల కుమార శర్మ, అవధాని రాధిక,కామేశ్వరి మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.









