**
కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున రామంతపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వర్గంటి అనిత గణేష్ నామినేషన్ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్పంచిగా గెలిపిస్తే రామంతపురం గ్రామ అభివృద్ధిలో ముందు ఉంచుతానని అన్నారు. అలాగే వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో రామంతపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుస్తానని వర్గంటి అనిత గణేష్ తెలిపారు. వీరి వెంట చుంచనకోట శ్రీకాంత్ గౌడ్, పెరమండ్ల శివరాములు, ముక్కనర్సిములు, పెరమండ్ల చందు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37









